బియ్యపు గింజలపై భగవద్గీత.. లా స్టూడెంట్ రికార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

బియ్యపు గింజలపై భగవద్గీత.. లా స్టూడెంట్ రికార్డ్

October 20, 2020

Micro Art: Hyderabad Law Student Captures The Bhagavad Gita on 4000 Grains of Rice

‘ఈగ’ సినిమాలో నటి సమంత మైక్రో ఆర్టిస్టుగా నటించింది. పెద్ద వస్తువును పోలేలా సూక్ష్మమైన వస్తువులను తయారుచేయడమే మైక్రో ఆర్ట్ గొప్పతనం. ఆ సినిమాలో సమంత ఈగ కోసం హెల్మెట్, సూది, బ్యాట్, ఇల్లు వంటివి తయారుచేస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఓ యువతి బియ్యపు గింజలపై హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను రాసి అరుదైన రికార్డు నెలకొల్పింది. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను.. మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలను రాసింది. మొత్తం 4,042 బియ్యపు గింజలపై రాసి రికార్డు నెలకొల్పింది. బియ్య‌పుగింజ‌ల‌పై కేవ‌లం 150 గంట‌ల్లోనే భగవద్గీత రాసి వహ్వా అనిపించింది. హైద‌రాబాద్‌కు చెందిన ఆమె పేరు రామగిరి స్వారిక. న్యాయ విద్య అభ్యసిస్తున్న ఆమెకు చిన్నప్పటినుంచే కళలపై ఆసక్తి ఉండేదట. 

ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా మైక్రో ఆర్ట్ చేస్తున్నానని తెలిపింది. కాగా, 2017లో ఒకే బియ్యపు గింజపై ఆంగ్ల అక్షరమాల రాసిన స్వారిక అత్యత్తుమ మైక్రో ఆర్టిస్ట్‌గా అంత‌ర్జాతీయ వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. గతేడాది నార్త్ ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్ సైతం స్వారికకు రాష్ట్రీయ పురస్కార్‌ను ప్రదానం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యికి పైగా మైక్రో డిజైనింగ్‌లు చేసి ప‌లు పురస్కారాలు అందుకున్నట్టు స్వారిక తెలిపింది.