సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. రిటైర్డ్ ఐఏఎస్ యుగంధర్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. రిటైర్డ్ ఐఏఎస్ యుగంధర్ కన్నుమూత

September 13, 2019

yugandhar.

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లకు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, రిటైర్డ్  ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ శుక్రవారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. 1962 బ్యాచ్‌కు చెందిన 80 ఏళ్ల యుగంధర్‌ ప్రధానికి కార్యదర్శి వంటి ఎన్నో కీలక పదవులు చేపట్టారు. నిజాయతీపరుడిగా, పేదప్రజల పక్షపాతిగా పేరొందారు. యుగంధర్ 2004-2008 మధ్య మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో  ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ పనిచేశారు. ముస్సోరిలోని లాల్‌బహుదూర్‌ శాస్త్రి ఐఏఎస్‌ అకాడమీకి డైరెక్టర్‌గానూ పనిచేశారు. యుగంధర్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసినప్పుడు వాటర్‌షెడ్‌ల అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్రాలతో ప్రమేయం లేకుండా నేరుగా కేంద్రం నుంచే  జిల్లాలకే నిధులు వచ్చేలా చూశారు.