Microsoft Founder bill gates Tries his Hands at Making 'Roti' with American Chef
mictv telugu

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ‘రొట్టె’ చేశాడు!

February 3, 2023

Microsoft Founder bill gates Tries his Hands at Making 'Roti' with American Chef

కంప్యూటర్ చేతబట్టే ఆయన.. రొట్టెల కర్ర చపాతీని చేశాడు. ఒక అమెరికన్ బ్లాగర్ తో కలిపి చెఫ్ గా మారి రొట్టెను చేశాడు బిల్ గేట్స్. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సెలబ్రిటీలు సమయం దొరికితే ఏదో ఒక వంటకం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అమెరికన్ వ్యాపారవేత్త బిల్ గేట్స్ వంతు వచ్చింది. ఆయన అమెరికన్ టెలివిజన్ చెఫ్ ఈటాన్ తో కలిసి రొట్టెను తయారు చేశారు. ఆ చెఫ్ తన అధికారిక ఇన్ స్టాలో ఆ వీడియోను పంచుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో హల్ చల్ చేస్తున్నది.

చాలాకాలం తర్వాత..
ఈ వీడియోలో బిల్ గేట్స్ స్వయంగా గోధుమ పిండిని కలిపారు. అయితే చేతితో కాకుండా గరిటెను కలిపారు. తర్వాత తానే స్వయంగా పిండి ముద్దను తీసుకొని చపాతీ చేశారు. గుండ్రంగా చేయడానికి చాలా కష్టపడ్డానని బిల్ గేట్స్ చెప్పారు. ఆపై బ్లాగర్ కూడా ఓ రోటీ తయారు చేశఆడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ పెనం పై నెయ్యి వేసి కాల్చారు. బిల్ గేట్స్ చాలా కాలం తర్వాత వంటు చేస్తున్నానని చెప్పారు. రోజూ సూప్ మాత్రమే వేడి చేసుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చపాతీని తిన్నారు. ఒక వ్యాపార్తవేత్త అయిత తనతో కలిసి ఇలా చపాతీని చేయడం, కలిసి తినడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు ఈటాన్ బెర్నాథ్.

బీహార్ వెళ్లినప్పుడు..
ఉత్తర భారతదేశంలో గోధుమ పంట బాగా పండుతుంది. అక్కడి రైతులను కలువడానికి ఈటన్ భారతదేశంలోని బీహార్ పర్యటనకు వచ్చాడు. ఇక్కడ గోధుమ విత్తే సాంకేతికలను తెలుసుకున్నాడు. అలాగే ఈటన్ ‘దీదీకి రసోయ్’ కమ్యూనిటీ క్యాంటీన్ లలో ఉండే మహిళలను కూడా కలుసుకున్నాడు. అక్కడే ఈ గోధుమ పిండి రొట్టె తయారు చేయడం నేర్చుకున్నాడు. దాన్నే బిల్ గేట్స్ కి నేర్పించాడు. మొత్తానికి ఈ వీడియో షేర్ చేసిన కొంత సేపట్లోనే లైక్స్, షేర్స్ తో ట్రెండింగ్ సృష్టిస్తున్నది.