ఈ మధ్య టెక్నాలజీ సెక్టార్‌లో చాట్‌జీపీటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారంగా పని చేసే ఈ టూల్ వల్ల మిగతా సెర్చ్ ఇంజిన్ల పని అయిపోతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సెర్చింజన్లు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గూగుల్ ఇప్పటికే బార్డ్ పేరును ప్రకటించగా, మైక్రోసాఫ్ట్ మరొక అడుగు ముందుకు వేసి తన చాట్‌జీపీటీ సేవలను లైవ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐ ఆధారిత ఆన్సర్ ఇంజిన్ ద్వారా సేవలు అందిస్తామని కంపెనీ చెప్తోంది. అయితే ప్రస్తుతానికి కేవలం ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ వరకే అందిస్తున్నామని, మొబైల్ ఫోన్లలో ఎప్పటినుంచి అందించాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. అటు యూజర్లందరికీ యాక్సెస్ వచ్చిందని చెప్తున్నా.. వెయిట్ లిస్ట్ ప్రాసెస్‌లో సేవలందిస్తోంది. అంటే ఈ సర్వీసును పొందాలంటే మొదట వెయిటింగ్ లిస్టులో చేరాల్సి ఉంటుంది. మీ వంతు వచ్చినప్పుడు ముందుగా మైక్రోసాఫ్ట్ మీకు సమాచారం అందిస్తుంది. అప్పుడు డెస్క్ టాపులో ఈ సర్వీసు పొందొచ్చు. మరి వెయిటింగ్ లిస్టులో ఎలాచేరాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఎడ్జ్ బ్రౌజర్ ఓపెని చేసి అడ్రెస్ బార్‌లో bing.com అని ఎంటర్ చేయాలి. అప్పుడు ఒక చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ask me anything అని ఉంటుంది. దాని కింద నాలుగు ప్రశ్నలు ఉంటాయి. వాటి కింద try it అనే పదాన్ని క్లిక్ చేస్తే పై ప్రశ్నకు జవాబు వస్తుంది. దాంతో పాటు కుడివైపున మరో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని కింద జాయిన్ ఇన్ ద వెయిట్ లిస్ట్ బటన్ క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ మెయిల్ లాగిన్ పేజీ వస్తుంది. అందులో మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ వంటి వివరాలు ఇచ్చిన తర్వాత వెయిల్ లిస్టులో ఉన్నారని చూపిస్తుంది. మీ వంతు వచ్చినప్పుడు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. అప్పుడు ఆ సేవలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.