microsoft set to lay off 11k employees from today
mictv telugu

అమెజాన్, గూగుల్ బాటలో మైక్రోసాఫ్ట్

January 18, 2023

microsoft set to lay off 11k employees from today

ఆర్దిక మాంద్యం దెబ్బ గట్టిగానే పడుతోంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, గూగుల్ లో ఉద్యోగాలు ఉడిపోయాయి. ఇప్పడు మైక్రోసాఫ్ట్ కూడా వీళ్ళని ఫాలో అవుతోంది. ఈరోజు ఈ సంస్థలో జాబ్ లు ఊడిపోనున్నాయి. మొత్తం సిబ్బందిలో 11 వేల మందిని తొలగించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

హెచ్ ఆర్, ఇంజనీరింగ్ క్యాటగిరీల్లో ఎక్కువ లే ఆఫ్ లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే రెండేళ్ళ పాటూ సాఫ్ట్ వేర్ రంగం ఇలాగే ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళే స్వయంగా చెప్పారు కూడా. డిజిటల్ సంస్థల్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఉన్నదానిలో మరింత సంపాదించడం లాంటివి చేయకపోతే వెంటనే ఉద్యోగాలు పోతాయని మైక్రోసాఫ్ట్ తేల్చి చెబుతోంది.

ఆర్ధి్ మాంద్యం దెబ్బ విండోస్, సహా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల మీద కూడా పడింది. దాంతో ఉత్పత్తుల విక్రయాలు తగ్గిపోయాయి. మరోవైపు క్లైడ్ బిజినెస్ కూడా ఏమీ అంత ఆశాజనకంగా లేదు. అందుకే ఈ ఉద్యోగాల కోత తప్పడం లేదని మైక్రోసాఫ్ట్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జూన్ లెక్కల ప్రకారం ఈ సంస్థలో ఇప్పటి వరకు 2, 21వేల మంది పని చేస్తున్నారు. ఇందులో 99 వేల మంది అమెరికాలో పని చేస్తుండగా 1, 22 వేల మంది ఇతర దేశాల నుంచి పని చేస్తున్నారు.