కష్టమైనా ఇష్టంగా.. మైక్‌టీవీ బతుకమ్మ సాంగ్-2018 మేకింగ్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కష్టమైనా ఇష్టంగా.. మైక్‌టీవీ బతుకమ్మ సాంగ్-2018 మేకింగ్ వీడియో

October 15, 2018

బతుకమ్మ పాట అంటే మైక్ టీవీ బతుకమ్మ పాటే.. ఇది మేం అంటున్న మాట కాదు. కోట్లాది అభిమానులు మనసులోతుల్లోంచి చెబుతున్న మాట. ఒక్క బతుకమ్మే పాటే కాదు, బోనాల పాట, సంక్రాంతి, పాట, తెలంగాణ రాష్ట్ర అవతరణ పాట.. మరే పాటైనా సంస్కృతీసంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరిస్తోంది మీ మైక్ టీవీ.

మైక్ టీవీ బతుకమ్మ పాట-2018 ప్రస్తుతం ఊరూవాడా మార్మోగిపోతోంది. మనసులు దోచుకుంటోంది. మంగ్లీ మంత్రముగ్ధ స్వరం, దామురెడ్డి కొసనం కళాత్మక దర్శకత్వం, మైక్ టీవీ ఇతర సాంకేతిక నిపుణల ప్రతిభ మేలిమి కలయికతో బతుకమ్మ సంబరాన్ని మరింత ఆకర్షణీయంగా కళ్లకు కట్టిందీ పాట. ఈ వీడియో సాంగ్ రూపొందడం వెనుక ఎవరు ఎంతగా కష్టపడినా అందరూ ఎంతో ఇష్టంతోనే పనిచేశారు. ఎండకు ఎండి, వానకు తడిశారు. అయినా వారి లక్ష్యమంతా బతుకమ్మ వేడుకను అపూర్వకంగా ఆవిష్కరించడమే. ఈ పాటకు వస్తున్న ప్రజాదరణకు మైక్ టీవీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతూ ఈ దృశ్యకావ్యం మేకింగ్ వీడియోను సగర్వంగా అందిస్తోంది.