ఈ బుడ్డోడికి అస్థిపంజరమే బెస్ట్ ఫ్రెండ్  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ బుడ్డోడికి అస్థిపంజరమే బెస్ట్ ఫ్రెండ్ 

September 28, 2020

Boy best friend skeleton

పిల్లలకు బొమ్మలంటే ఇష్టం. ఆడపిల్లలు బార్బీ డాల్, మగపిల్లలు కార్లు, రాకెట్లతో నానా అల్లరీ చేస్తుంటారు. కానీ ఏ పిల్లయినా, ఏ పిల్లాడయినా భయంకరమైన అస్థిపంజరంతో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదు, ఏకంగా దాన్ని బెస్ట్ ఫ్రెండుగా మార్చుకుని ముప్పొద్దులా దానితోనే గడిపేస్తారా? 

అమెరికాలోని ఉటా రాష్ర్టానికి చెందిన రెండేళ్ల థియో గాడి కథ ఇది. వాడికి అస్థిపంజరమంటే చచ్చేంత ప్రేమ. భోజనం, షాపింగ్, నిద్ర, టీవీ.. ఏదైనా, ఎప్పుడైనా సరే 24 గంటలూ ఈ ఎముకల గూడు వాడి పక్కన ఉండి తీరాల్సిందే. లేకపోతే ఇల్లు పీకి పందిరేసి పారేస్తాడు. ఐదు అడుగుల ఎత్తున్న ఈ అస్థిపంజరం నిజమైనది కాదు లెండి, బొమ్మనే. దాని పేరు బెన్నీ అంట. ఈ నెల 15 నుంచి దానికీ, అతనికీ ఫ్రెండ్షిప్ మొదలైంది. బేస్మెంటులో వరద వచ్చినప్పుడు సామాన్లను పైకి తెస్తుండగా బుడ్డోడికి అది కనిపించింది. అప్పట్నుంచీ దాన్ని కరుచుకునే ఉన్నాడు. కథ అంతటితో పూర్తి కాలేదు. థియో మొన్నlo ఓ షాపుకెళ్లి కుక్క అస్థిపంజరం బొమ్మ కొనుక్కున్నాడు! అటు మనిషి ఎముకల గూడు, ఇటు కుక్క ఎముకల గూడును ముందేసుకుని ఏవేవో ఆటలాడుకుంటూ ఉంటాడు. వాళ్లమ్మ ఈ వింత టేస్ట్ బొమ్మలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. పిల్లలు నిజానికి భయపడరని, పెద్దలమే వాళ్లకు దెయ్యం, గియ్యం అని భయం నేర్పిస్తామని మానసికనిపుణులు చెబుతున్నారు.