‘పాడుకో, ఈ పాట పాడుకో.. నిన్ను నువ్వు కాపాడుకో’ అంటూ మీ మైక్ టీవీ ర్యాప్ సాంగ్తో మీ ముందుకొచ్చింది. లాక్డౌన్ ఆంక్షలను ప్రతీ ఒక్కరూ పాటిస్తే కరోనాను ఈ దేశం నుంచి తరిమేయవచ్చన్న సందేశంతో దీన్ని రూపొందించారు. Megh-uh-Watt దీన్ని రాసి, స్వయంగా పాడారు. ఎం ధీరజ్ సంగీతం అందించారు.
‘సౌదాలకు పోయి నువ్వు నీ సంచి నింపకు
ఎంత కావాల్నో అంత తెచ్చుకో నీ ఇంట్లకు
సర్కారు మాటలను నువ్వు అధిగమించకు
పోలీసోళ్ల నియమాలను అతిక్రమించకు
చేతులెత్తి జోడిద్దాం వారి సహాయతకు
సదా మనకు డాక్టర్లే వెన్నంటి వుండగ
వారిని తిట్టి కొట్టి చేసుకోకు లైఫు దండగ
నర్సులు, ఫార్మాసిస్టులు, సఫాయి అన్నలక్కలకు చేతులెత్తి మొక్కుదాం’ అని సాగుతుంది.
కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని అందరికీ తెల్సిందే. అయినా కొందరు ఆ విషయాన్ని మరిచి లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు మన ప్రాణాలు కాపాడటానికి రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వారి సేవలను గుర్తించకుండా కొందరు మూర్ఖులు వారి మీద దాడులకు పాల్పడుతున్నారు. ఇది మంచిది కాదు.. కరోనా కష్టంలో మనందరం ఒక్కతాటి మీద సంయమనంగా నడవాల్సిన పరిస్థితి ఉందని పాట కోరుతోంది.
‘శ్రమజీవివి నువ్వు ఓపికతో ఇంట్లుండు.
దేశానికి తప్పించు ముప్పు. మాస్కు ధరించు..
నిన్ను నువ్వు కాపాడుకొని జీవితాన్ని తరించు’
ఇంకెందుకు ఆలస్యం పాడుకో ఈ పాట పాడుకో.. నిన్ను నువ్వు కాపాడుకో.