కనకవ్వకు మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి సత్కారం - MicTv.in - Telugu News
mictv telugu

కనకవ్వకు మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి సత్కారం

February 3, 2020

Mictv.

మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహించిన పాటలపోటీ కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’తో ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయింది గొట్టె కనకవ్వ. కార్యక్రమంలో ఆమె పాడిన పాటలు టిక్‌టాక్‌లో ట్రెండింగ్ అయ్యాయి. ఎవరీమె ఇంత అద్భుతంగా పాడుతోందని అందరూ అభిమాన గొంతులు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మధురమైన గొంతును మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మైక్ టీవీ సక్రాంతి పాట, మేడారం పాటలను ఆమె చేత పాడించింది. ఈ రెండు పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. మిలియన్ వ్యూస్ సాధించాయి. కనకవ్వ పాట సూపర్ అంటూ ఎంతో మంది ఆమె పాటకు పట్టాభిషేకం కట్టారు. తెలంగాణ మట్టికి ఉన్న సాంస్కృతిక శోభను చాటి చెప్పిన కనకవ్వను మైక్ టీవీ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి సత్కరించారు. 

ఆమెను తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యం అందించారు. శాలువా కప్పి చిరు సత్కారం చేశారు. ‘మేము చేసింది ఏం లేదు. నీ గాత్రమే నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. నీలాంటి మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించడంలో మైక్ టీవీ ఎప్పుడూ ముందు ఉంటుంది’ అని అప్పిరెడ్డి అన్నారు. ఆయన శ్రీమతి స్వాతి అప్పిరెడ్డి కూడా కనకవ్వను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ములుగుబొక్క దర్శకుడు వీరాస్వామి కర్రెను కూడా శాలువా కప్పి సత్కరించారు. మూలుగుబొక్కకు అక్కినేని అవార్డు వచ్చిన సందర్భంలో ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మైక్ టీవీ సీఈఓ సతీష్ మంజీరా, పటాస్ బల్వీర్ సింగ్, మైక్ టీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.