పెళ్లి కోసమే గుళ్లు గోపురాలా…
దేవసేన అనుష్క గుళ్లు గోపురాలు ఎందుకు తిరుగుతోంది. పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేస్తుందా… మంచి భర్త కోసమే రాహుకేతు పూజల్లో పాల్గొందా..కుటుంబసభ్యులు చూస్తున్న సంబంధాలు సెట్ కాకపోవడమే కారణమా…
స్వీటీ అనుష్క సూపర్ తో తెలుగు తెరకు పరిచయమై బాహుబలితో స్టార్ డమ్ సాధించింది. ఓవైపు అనుష్క సినిమాల్లో తెగ బిజీ ఉంటే ఇంట్లో వాళ్లు మాత్రం పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఒక్కటి కూడా సెట్ కాకపోవడంతో పూజలు చేపిస్తున్నారంటూ సినీలోకం అంటోంది. ఆ మధ్య రాహుకేతు పూజలో పాల్గొన్న అనుష్క తాజాగా కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొల్లూరులో వున్న మూకాంబిక దేవాలయానికి వచ్చింది. తన తల్లి ప్రఫుల్ల, సోదరుడు గుణరంజన్, సోషల్ యాక్టివిస్ట్-పొలిటీషియన్ ముత్తప్ప రాయ్ తో కలిసి వచ్చిన అనుష్క ప్రత్యేక పూజలు చేయించుకుంది.
అనుష్క తన పెళ్ళి కోసం ప్రత్యేక పూజలు చేయించుకుందనే విషయాన్ని మాత్రం వారి కుటుంబ సభ్యులు కాదంటున్నారు. బాహుబలి సినిమా మంచి సక్సెస్ సాధించిన సందర్భంగానే అనుష్క గుడికి వెళ్లి పూజలు చేసిందని, షూటింగ్ తో బిజీగా ఉన్న అనుష్క చాలా కాలం తర్వాత బెంగళూరికి రావడంతో తాము గుడికి వెళ్లామంటూ అనుష్క తండ్రి విఠల్ చెబుతున్నాడు. గతంలో రజినీకాంత్ సరసన నటించిన లింగా సినిమా షూటింగ్ సమయంలోనూ అనుష్క అక్కడి మూకాంబిక అమ్మ వారిని దర్శించుకుంది.