ఆ నా కొడుకులను ఏసేస్తా.. న్యాయం కోసం(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఆ నా కొడుకులను ఏసేస్తా.. న్యాయం కోసం(వీడియో)

November 30, 2019

‘తప్పు చేసినవాడిని బహిరంగంగా శిక్షించాలి. కోర్టులు, చట్టాలు నేరస్థులను మేపుతాయి తప్పితే శిక్షించవు. అలాంటి నయవంచకులను ప్రజలకు అప్పగించాలి. సామాజిక శిక్షే వారికి సరైన గుణపాఠం’ అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆగ్రహంతో అట్టుడికిపోతున్నారు. షాద్ నగర్, శంషాబాద్, చర్లపల్లి వద్ద ఏ వ్యక్తిని కదిలించినా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డిని అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి హత్య చేశారు. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అరబ్ చట్టాలను ఇక్కడ అమలుచేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో మీ మైక్ టీవీ ‘న్యాయం కోసం’ అనే వీడియోను విడుదల చేసింది. ‘పటాస్’ బల్వీర్ సింగ్, ప్రసాద్‌లు నటించారు. ప్రియాంక హత్య జరిగిందని కత్తి పట్టుకుని ఆవేశంగా బయలుదేరుతాడు బల్వీర్. అవన్నీ చట్టాలు చూసుకుంటాయని ప్రసాద్ అంటాడు. చట్టాలు వాళ్లను ఏం చేయలేవు.. తానే వాళ్లను ఖండఖండాలుగా నరికేస్తాను అంటాడు. పసిబిడ్డలను కూడా వదలకుండా కామాంధులు ఆడపిల్లలను చిదిమేస్తున్న ఘటనల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. వారసత్వం కోసం కొడుకులను కనగానే సరిపోదు వారిని సక్రమంగా పెంచాలని హితబోధ చేస్తాడు. ఆడపిల్లలు ‘అమ్మా’ అని ఆర్తనాదాలు చేసినప్పుడైనా మీ అమ్మను గుర్తు చేసుకోండిరా అని చెబుతాడు. ఇలాంటి సందర్భాలలో ఆవేశం సబబు అని చెబుతోంది ఈ వీడియో. క్రింది లింకులో వీడియో చూడండి.. షేర్ చేయండి.