మైక్ టీవీ తెలంగాణ పాట వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ తెలంగాణ పాట వచ్చేసింది..

May 30, 2019

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ మైక్ టీవీ పూర్తి పాట వచ్చేసింది.

‘ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాకా

ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాకా

ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాకా

ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాకా’

అంటూ సాగే వీడియో సాంగ్‌ కొద్దిసేపటి క్రితం మైక్ టీవీలో విడుదలైంది. ఈసారి కొత్తగా, వినూత్నంగా మీ ముందుకు వచ్చింది. మంచి జోష్‌ఫుల్‌గా, కొత్త స్టెప్పులతో పాట సాగుతుంది. మంగ్లీ గాత్రం అందరినీ అలరిస్తోంది. తిరుపతి మాట్ల సాహిత్యం, బాజి సంగీతం వినసొంపుగా వుందని కామెంట్లు చేస్తున్నారు. పాటలో మిళితమై వచ్చిన ర్యాప్ కూడా బాగుందని అంటున్నారు. తెలంగాణ ప్రజల జీవన శైలి, మనుషుల స్వభావాలు, ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాలను పాటలో చెప్పే ప్రయత్నం చేశాం. మైక్ టీవీ నుంచి వచ్చిన అన్నీ పాటలను ఆదరించినట్టుగానే ఈ పాటను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అప్పిరెడ్డి నిర్మాణంలో దామురెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ పాటను చూడాలంటే కింది లింకును ఓపెన్ చేయండి.

ర్యాప్ : మేఘ్ ఉహ్ వట్

డీఓపీ : తిరుపతి

ఎడిటింగ్ : ఉదయ్ కుంభం

సౌండ్ : శివప్రసాద్ బల్లా

జీఎఫ్ఎక్స్ : మిట్టు ఆరెట్టి

కోఆర్డినేటర్ : సతీష్ దామ (బీబీ నగర్)

ఎగ్జిక్యూషన్ : సతీష్ మంజీర  

నిర్మాత : అప్పిరెడ్డి

డ్రెస్ కర్టెసీ : పార్వతీ కుమార్

కలరిస్ట్ : సంజీవ్ మామిడి (రెయిన్ బో)

కోరస్ : ఇందిర

Percussions : అనిల్ రాబిన్

గిటార్ : హిమాన్ ముంద