దోమకాటుకు కుక్కదెబ్బ.. జాగిలాలతో మలేరియాకు చెక్

కుక్క కాటుకు చెప్పుదెబ్బ సంగతి తెలుసు కదా. రోగం బట్టి వైద్య తీవ్రత ఉండాలి. వైద్య శాస్త్రం ఎంతో ఎదిగినా కొన్ని ప్రకృతిసిద్ధమైన ఉపాయాలు కూడా ప్రాణాలు నిలుపుతున్నాయి. ప్రమాదాలను కొన్ని జంతువులు ముందుగా పసిగడతాయన్న సంగతి మనకు తెలిసిందే కదా. అలాంటిదే మనం ఇప్పుడు చెప్పుకోబోయే సంగతి.Telugu news Malaria Sniffer dogs to help in fight to eradicate disease trained dogs to recognise tell-tale aromas using clothes from people infected with the disease. It is hoped the animals can be used to stop malaria spreading and eventually help with eradication.ఏటా 4 లక్షల మందిని పొట్టన బెట్టుకుంటున్న మలేరియా వ్యాధికి జాగిలాలతో ముందుగానే పసిగట్టొచ్చని ఇంగ్లండుకు చెందిన డర్హమ్ వర్సిటీ శాస్త్రవేత్త స్టీవెన్ లిండ్సే చెబుతున్నారు. స్నిఫర్ డాగ్స్.. మలేరియా వ్యాధిగ్రస్తులను కేవలం వాసనతోనే పసిగట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యాధిసోకిన పిల్లల్లలో 70 శాతం మందిని వారి సాక్సులు, దుస్తులను వాసన చూడ్డం ద్వారా ఈ జాగిలాలు పక్కగా పసిగట్టాయని తెలిపారు. పుండ్లు, కేన్సర్ వంటి ఇతర వ్యాధి సంబంధ లక్షణాలను గుర్తించడంలోనూ కుక్కలకు శిక్షణ ఇస్తే వ్యాధి నిర్ధారణ సులభతరం అవుతుందన్నారు. ఫలితంగా రక్త పరీక్షలు వంటి అదనపు భారాలు ఉండవని, పేద దేశాల్లో దీని వల్ల సానుకూల ఫలితాలు సాధిచొచ్చని న్నారు. అయితే ఈ విషయంలో మరిన్ని ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.