OLXలో అమ్మకానికి పటేల్ విగ్రహం.. ధర ఎంతో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

OLXలో అమ్మకానికి పటేల్ విగ్రహం.. ధర ఎంతో తెలుసా?

April 4, 2020

Vallabhbhai Patel Statue Sale In OLX

అమ్మో ఒకటో తారీఖు సినిమాలో తనికెళ్ల భరణి హస్యనటుడు బ్రహానందానికి చార్మినార్ అమ్మే  సీన్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఇది చూసి అతని అమాయకత్వానికి తెగ నవ్వుకొని ఉంటారు. అలాంటిదే నిజ జీవితంలో కూడా జరిగింది. ఇక్కడ అమ్మజూపింది ఏదో సాదాసీదా వస్తువు కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్ధార్ వల్లబాయ్ పటేల్ ( స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ) విగ్రహం. దీన్ని ఓ వ్యక్తి ఏకంగా OLX లో అమ్మకానికి పెట్టాడు. దాని ధర కూడా రూ. 30 వేల కోట్లు మాత్రమే అని పేర్కొనడంతో ఇది చూసిన వారంతా షాక్ అయ్యారు. 

గుర్తు తెలియని వ్యక్తి OLX లో ఈ విధంగా మెసేజ్ పెట్టాడు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మబడును. ఇది కావాలనుకున్న వారు రూ.30వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండటంతో అమ్మేస్తున్నాం. వాటి ద్వారా హెల్త్ కేర్ కిట్లు, ఆస్పత్రులకు కావాల్సిన సామాగ్రి కొనుక్కోవాలి’ అంటూ పేర్కొన్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఇది వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 

ఇప్పటికే కరోనా వైరస్ పీఎం కేర్స్ పేరుతో విరాళాలు ఇవ్వాలని కోరింది. ఈ సమయంలో పటేల్ విగ్రహాన్ని ఆ వ్యక్తి అమ్మకానికి పెట్టాడు. కాగా గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో 182 మీటర్లతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని జాతి ఐక్యతకు చిహ్నంగా ప్రకటించారు.  ఈ విగ్రహం కోసం ఏకంగా కేంద్రం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.