ఎమ్మెల్యేలకు మధ్యాహ్న భోజన పథకం 

మధ్యాహ్న భోజన పథకాన్ని స్కూల్ విద్యార్థులకు పెట్టినట్టే, ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయబోతున్నారు. కానీ ఇది మనదగ్గర అన్కునెరు, కాదు కర్ణాటకల. దీనికి ప్రధాన కారణం… అక్కడ విధాన సభ జరిగినప్పుడు సభలో కనీసం పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఉండటం లేదట. నాకు ఆకలైతోందని ఒకరు, అమ్మో నాకు షుగర్ ఉంది టైంకు తినాలె అని ఇంకొకరు, ఇట్ల మధ్యాహ్నం టైం వరకు సభ మొత్తం ఖాళీ అయితుందట. దీంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తేనైనా ఉదయం సభకు హాజరైన సభ్యులు.. మధ్యాహ్నం కూడా ఉండే అవకాశం ఉందని స్పీకర్ కేబీ కోలివద్ ఈ నిర్ణయం తీస్కున్నడు. బాధ్యతగల ప్రజాప్రతినిధులు కాబట్టి.. ఉదయం, మధ్యాహ్నం సభకు హాజరు కావాల్సిన అవసరం ఉందని అన్నడు. మరి ఆ మధ్యాహ్న భోజనంల ఎమ్మెల్యేలందరికి ఇష్టమైనవి ఏంటియో, మరీ తెల్సుకొని పెడితే మంచిది సార్లు, లేకపోతే నాకు ఈ కూర నచ్చలేదు, అన్నం మెత్తగైంది అనే కారణాలతోని  మల్లా ఇంటి బాట పడ్తరేమో ఎమ్మెల్యేలంత. అసలే కష్టపడి ఓట్లేశి గెల్పిచ్చుకున్నం, ఆళ్లను మంచిగ అర్సుకోన్రి సార్లు అని కోరుకుంటున్నరు ఆ ఎమ్మెల్యేలకు ఓట్లేసి గెలిపిచ్చుకున్న ఓటర్లు.

SHARE