ద్యావుడా.. మిగ్ విమానం OLXలో అమ్మకానికి..  - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా.. మిగ్ విమానం OLXలో అమ్మకానికి.. 

August 4, 2020

Mig aircraft in olx for sale.

OLXలో ఎవరైనా మొబైల్ ఫోన్లు, బైకులు, ఫర్నిచర్ అమ్మకానికి పెడతారు. కానీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఓ ప్రబుద్దుడు ఏకంగా యుద్ధ విమానాన్నే రూ.10 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. 2009లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వారు ఆ యూనివర్సిటీకి మిగ్‌-23బీఎన్ యుద్ధవిమానాన్ని బహుమతిగా ఇచ్చింది. దాన్ని క్యాంపస్‌లో విద్యార్థుల పరిశోధనలకు ఇచ్చారు. 

ప్రస్తుతం ఆ విమానం OLXలో అమ్మకానికి ఉంది. ప్రస్తుతం ఈ విషయం సంచలనం అవుతోంది. ‘తమ యూనివర్సిటీకి చెందిన ఎవరూ ఆ విమానాన్ని OLXలో పెట్టలేదని, ఇది ఎవరో ఆకతాయిలు చేసిన చర్య అని యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ వసీం అలీ తెలిపారు. ఈ విషయంపై తాము విచారణ చేపట్టామని, ఈ పని ఎవరు చేశారో తెలుసుకుంటామని వసీం అలీ వెల్లడించారు. సదరు విమానం ఫొటోను OLX నుంచి తీసేశామని తెలిపారు.