క్వారంటైన్ సెంటర్ వద్దే వలస కూలీ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

క్వారంటైన్ సెంటర్ వద్దే వలస కూలీ ఆత్మహత్య

May 15, 2020

Quarantine

క్వారంటైన్ సెంటర్ వద్ద ఓ వలస కార్మికుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న ఓ క్వారంటైన్ సెంటర్ వద్ద చోటు చేసుకుంది. జిల్లాలోని రైకమా గ్రామానికి చెందిన 38 ఏళ్ల సురేంద్ర బెహెరా అనే వలస కార్మికుడు తన భార్యతో కలిసి ఏపీలోని విజయవాడ నుంచి 6 రోజుల క్రితం వచ్చాడు. దీంతో అధికారులు భార్యాభర్తలిద్దరినీ క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. ఏమైందో తెలియదు గానీ, తెల్లారేసరికి సురేంద్ర బెహరా చెట్టుకు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతదేహం వద్ద అతని భార్య కన్నీరు మున్నీరవడం పలువురిని కలిచివేసింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.