వలస కూలీల బస్సుకు ప్రమాదం..ఒకరి మృతి,10 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

వలస కూలీల బస్సుకు ప్రమాదం..ఒకరి మృతి,10 మందికి గాయాలు

May 5, 2020

Migrant Workers BusIn Odisha

అసలే కష్టకాలం. ఎలాగోలా కరోనా కాలంలో సొంత ఊరిలో ఉండిపోవాలని వలస కూలీలు ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి చివరకు వారిని స్వస్థలాలకు చేర్చాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలు సొంత ఊళ్లకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఒడిశా వాసులు తమ స్వగ్రామాలకు బస్సులు, రైళ్లలో బయలుదేరారు. 

వలస కూలీలతో కటక్‌‌కు కూడా 40 మంది కూలీలతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఖుర్ధా జిల్లా కుహిడి చౌక్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఈ తెల్లవారుజామున ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో బస్సు డైవర్ మరణించగా 10 కూలీలకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మరణించిన బస్సు డ్రైవర్ హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌‌గా గుర్తించారు. కాగా ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు సోమవారం హైదరాబాద్‌ నుంచి కటక్‌ బయల్దేరింది.