అన్నం తింటున్న వలస కూలీని ఢీ కొట్టిన కారు - MicTv.in - Telugu News
mictv telugu

అన్నం తింటున్న వలస కూలీని ఢీ కొట్టిన కారు

May 11, 2020

Migrant Workers Cycling Back to Bihar 

లాక్‌డౌన్‌తో పని లేక సొంత ఊరికి సైకిల్‌పై పయనమైన వ్యక్తి మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. కారు రూపంలో వచ్చిన మృత్యువు అతను ఇంటికి చేరకుండా అడ్డుపడి అనంత లోకాలకు తీసుకెళ్లింది. ప్రయాణం చేసి అలసిపోయి అన్నం తింటున్న అతడు ప్రమాదానికి గురయ్యాడు. లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. కరోనా వదిలి పెడుతుందని అనుకున్నా.. కారు మాత్రం అతని ప్రాణాలు తీసుకెళ్లిందని విలపిస్తున్నారు. దీంతో అతని భార్య, ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 

బిహార్‌కు చెందిన సగీర్ అన్సారీ (26) ఢిల్లీలో వలస కూలీగా వెళ్లాడు. లాక్ డౌన్‌తో పని లేకపోవడంతో  తూర్పు చంపారన్‌కు వెళ్లాలని అనుకున్నాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి సైకిల్‌పై పయనం అయ్యాడు. 

ఈ నెల 5న ప్రారంభమై వారంతా ఐదు రోజులకు లక్నో శివార్లకు చేరుకున్నారు. అక్కడ ఆగి  భోజనం చేసేందుకు డివైడర్ పై కూర్చున్నాడు. ఆ సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు అతన్ని ఢీ కొట్టింది. తోటి స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఆ కారు చెట్టును ఢీ కొనడంతో మిగితావారు బతికి బయటపడ్డారు.