మీ సైకిల్ తీసుకుంటున్నా, క్షమించండి.. వలసకూలీ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

మీ సైకిల్ తీసుకుంటున్నా, క్షమించండి.. వలసకూలీ లేఖ

May 16, 2020

Bicycle

ఉపాధి లేకపోవడంతో వలస కూలీలు ప్రతి రోజూ లక్షలాది మంది తమ సొంత ఊళ్లకు పయనం అవుతూనే ఉన్నారు. కాలినడకన, ట్రక్కులు, సైకిళ్లు ఏది పడితే అది పట్టుకొని వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంలో ఓ వలస కూలీ రాసిన లేఖ ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేసింది. అతని నిజాయితీ, ప్రస్తుతం ఉన్న అవసరం ఎలాంటిదో ఇది కళ్లకు కట్టినట్టుగా చూపించింది. వందల కిలోమీటర్లు నడవలేక ఓ సైకిల్ తీసుకొని వెళ్లాడు. ఆ సమయంలో దాని యజమానికి విషయాన్న వివరిస్తూ  ఓ లేఖ కూడా రాసి పెట్టాడు. ఇప్పుడదని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

రాజస్థాన్‌లోని భ‌రత్‌పూర్‌లో ఈ ఆస‌క్తిక‌ర ఘటన జరిగింది. ఓ వలస కార్మికుడు తన సొంత ఊరికి వెళ్లేందుకు ఓ ఇంటిలోని సైకిల్ తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా అతడు ఓ లేఖ కూడా రాసిపెట్టాడు. ‘ నేను మీ సైకిల్ తీసుకుంటున్నాను. నన్ను క్ష‌మించండి. నాకు ఇంటికి వెళ్లేందుకు మ‌రో మార్గం లేదు. నా కొడుకు వికళాంగుడు అందుకే అతన్ని  తీసుకెళ్లాలనే ఈ విధంగా చేయాల్సి వచ్చింది.  మేము  బరేలీ వరకు వెళ్ళాలి క్షమించండి’ అంటూ  రాశాడు. దీన్ని చూసిన యజమాని సహబ్ సింగ్ తన సైకిల్ ఈ విధంగా అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడటం సంతోషంగా ఉందని తెలిపాడు. అతని నిజాయితీ ఏంటో ఈ లేఖలో అర్థమౌతోందని అన్నాడు.