నెలకు 28 లక్షల పొగ పీల్చేస్తున్నాడు..
హెవీ వెయిట్ ఛాంపియన్, బాక్సింగ్.. ఈ పేర్లు వినగానే మనకు తొలుత గుర్తుకువచ్చేది మైక్ టైసన్. ఈ మల్లయోధుడు హాలీవుడ్ సినిమాలతోపాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు. ఇంతకీ ఆయన చేసే వ్యాపారం ఏంటనుకుంటున్నారు? కాలిఫోర్నియాలో డ్రగ్స్ వ్యాపారం చేసుకుంటున్నాడు. డ్రగ్స్ అక్కడ చట్టబద్ధమైన వ్యవహారం కావడంతో ఆయన వ్యాపారంలో విజయవంతంగా ముందుకు పోతున్నాడు.
అయితే టైసన్ కొన్ని మనకు తెలియని విషయాలను తాజాగా ‘హాట్‌బాక్సిన్ విత్ మైక్ టైసన్’ కార్యక్రమంలో పాల్గొని వెల్లడించాడు. తాను, తన వ్యాపార భాగస్వామి ఎబెన్ బ్రిట్టన్ కలిసి నెలకు 40 వేల డాలర్ల (రూ.28,38,000) విలువ చేసే వీడ్ (ఒక రకమైన మత్తు పదార్థం)ను పీల్చుతామని చెప్పాడు. తాను పండించే వీడ్ తప్ప ఇంకేదీ వాడను’ అని చెప్పాడు.
చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఘన చరిత్ర టైసన్‌ది. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో 20 ఏళ్ల వయసులో హెవీ వెయిట్ ఛాంపియన్‌గా అవతరించాడు. బాక్సింగ్‌కు స్వస్తి చెప్పిన తర్వాత టైసన్ అడపా దడపా హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడిలా డ్రగ్స్ వ్యాపారంలో రాణిస్తున్నాడు.