మిలాద్ ఉల్ నబీ ర్యాలీ..హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

మిలాద్ ఉల్ నబీ ర్యాలీ..హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

November 10, 2019

నేడు నగరంలో మిలాద్ ఉల్ నబీ ర్యాలీ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాతబస్తీతో పాటు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ర్యాలీ సందర్భంగా చాదర్‌ఘాట్ వద్ద ఆర్టీసి బస్సులను మళ్లిస్తారని, ఎస్‌జే రోటరీ, మిరాలం మండి రోడ్డు ర్యాలీ ముగిసే వరకు బస్సులకు అనుమతి ఉండదని తెలిపారు. 

ర్యాలీలో పాల్గొనేవారు తమ వాహనాలను చార్మినార్ బస్ టర్మినల్‌లో పార్కు చేయాలని సూచించారు. ర్యాలీ కొనసాగే ప్రాంతాలలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఆదివారం పాతబస్తీలోని చార్మినార్, గుల్జార్ హౌస్, ఝాన్సీబజార్, సిటీ కాలేజీ, మొఘల్‌పురా, ఢిల్లీగేట్, దారుల్ షిఫా, చట్టబజార్, మదీనా, ఏపీఏటీ, పురాణహేవిలి, ఎతెబార్‌చౌక్, కోట్ల అలీజ పరిసర ప్రాంతాల మీదుగా ర్యాలీ వెళ్లనుంది. ర్యాలీల సందర్భంగా, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.