ఒంగోలులో భూకంపం.. కర్ణాటకలోనూ..  - MicTv.in - Telugu News
mictv telugu

ఒంగోలులో భూకంపం.. కర్ణాటకలోనూ.. 

June 5, 2020

Mild earthquakes hit ongole, Karnataka, Jharkhand at the same time

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. తీవ్రత తక్కువ కావడంతో చాలామంది ఈ విషయం పట్టించుకోలేదు. శర్మా కాలేజీ, అంబేద్కర్‌ భవన్‌, ఎన్జీవక్ష కాలనీ, సుందరయ్య భవన్‌ రోడ్డులో భూమి కంపించింది. పటాసుల శబ్దం అనుకుని కొందరు పట్టించుకోలేదు. కొందరు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.  జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. జంషెడ్‌పూర్‌లో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.7గా నమోదైంది. కర్ణాటకలోని హంపిలోనూ భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని అక్కడి అధికారులు చెప్పారు. 

కాగా పశ్చిమ తీరంలో నిసర్గ తుపాను బలహీనపడింది. మహారాష్ట్రలో ఇంతవరకు ఆరుగురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ముంబైతోపాటు పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.