మహిళా పోలీసు అధికారి దారుణ హత్య - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా పోలీసు అధికారి దారుణ హత్య

March 16, 2019

పుల్వామా ఉగ్రవాద దాడితో ముష్కర మూట రెచ్చిపోతోంది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగారు. సోసియాన్ జిల్లాలో ఓ మహిళా పోలీసు అధికారిని కాల్చిచంపారు. సోపియాన్‌లో ఖష్బూ అనే ఎస్పీఓను దుండగులు ఆమె ఇంటి వద్దే తుపాకీతో కాల్చేశారు. రక్తపుమడుగులో పడి ఉన్నా ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

Militants gun down woman police officer outside her house in Kashmir s Shopian.

కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. కశ్మీరీల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఉగ్రవాదులు కొన్నాళ్లుగా సామాన్య పౌరులను, ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల సైన్యంలో చేడాడన్న అక్కసుతో హుసేన్ అనే యువకుణ్ని కాల్చిచంపారు.