పాలలో హానికర రసాయనాలు.. మరిగించడమే సమస్యకు పరిష్కారం… - MicTv.in - Telugu News
mictv telugu

పాలలో హానికర రసాయనాలు.. మరిగించడమే సమస్యకు పరిష్కారం…

May 20, 2017

పొద్దున్న లేస్తే పాలు కావాల్సిందే..టీ , కాఫీ , హార్లిక్స్ ఏదీ కావాలన్న మిల్క్ మస్ట్..మార్కెట్లో ఏదో కాస్తా పేరున్న ప్యాకెట్ కొని తీసుకొస్తాం..ఆరోగ్యాన్నించే ఈ పాల గురించి ఇది తెలుసుకుంటే దడ పుట్టాల్సిందే..రోజూ తాగే పాలలో హానికర రసాయనాలున్నాయట.

తెలంగాణ పశు వైద్య యూనివర్సిటీ పరిశోధకులు పాలపై నిర్వహించిన పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. పురుగుల మందులు చల్లిన పశుగ్రాసం తినడం వల్ల వాటి పాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని బయటపడింది. కలుషిత నీరు. ఫెస్టిసైడ్ , పశుగ్రాసం వల్ల పాలు విషతుల్యమవుతున్నాయని పరిశోధకులు తేల్చారు.
ఇలాంటి పాలతో దీర్ఘకాలంలో కాన్సర్, అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. పాలను ఎక్కవసేపు మరిగించడమే సమస్యకు కారణమని వారు చెబుతున్నారు. రెండు పొంగులు రాగానే స్టవ్ మీద నుంచి దించకుండా పది నిమిషాల మరిగించాలని సూచిస్తున్నారు.