జగన్‌కు కర్ణాటక ఉద్యోగులు ఫిదా.. పాలాభిషేకం..  - MicTv.in - Telugu News
mictv telugu

 జగన్‌కు కర్ణాటక ఉద్యోగులు ఫిదా.. పాలాభిషేకం.. 

September 19, 2019

Milk anointing for Jagan cutout in Karnataka ..

నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఈమధ్య ఆయన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విలీన ప్రక్రియ కర్ణాటక రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. అక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. హీరే కరూర్‌లోని కేఎస్ ఆర్టీసీ డిపో సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఏపీలో ఇంత మంచిపని చేసిన మహా నాయకుడు అంటూ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

ఇదిలావుండగా ఈ ఆర్టీసీ సెగ తెలంగాణ ప్రభుత్వానికి తాకిన విషయం తెలిసిందే. తెలంగాణలో సైతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అలాగే ఏపీ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటూ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. దీని ఎఫెక్ట్ తమిళనాడులో బాగా వుంది. తమిళనాడులో కూడా ఆంధ్రా తరహా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఓ ఉద్యమమే మెుదలైంది. జగన్‌ను పొగుడుతూ ‘ఆంధ్రా తలైవా’ అంటూ కూడా ఫ్లెక్సీలు వేసి మరీ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.