Home > Featured > బాన్సువాడలో ప్లాస్టిక్ పాలు కలకలం

బాన్సువాడలో ప్లాస్టిక్ పాలు కలకలం

yhnghn

పాలను నీళ్లను కలపడం చూసాం. కానీ, ఇటీవల కొందరు అత్యాశకు పాల్పడి ప్లాస్టిక్ పాలను తయారు చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో పాలను ఉడికిస్తే ప్లాస్టిక్‌ పదార్థంలా మారాయి. రాజారాం దుబ్బ వాసి అస్లాం పాలకేంద్రం నుంచి లీటర్ పాలు తీసుకునివచ్చాడు. వాటిని వేడి చేయగా అవి కాస్త విరిగిపోయాయి. వాటిని వేడి చేసి అందులో చక్కెర కలుపుకొని తిందామని పాలను మరిగించాడు.

అయితే ఆ పాలు ప్లాస్టిక్ ముద్దగా మారాయి. దీంతో అస్లాం షాక్ అయ్యాడు. పాల నుంచి ప్లాస్టిక్ వాసన రావడంతో డీఎస్పీ దామోదర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. తరువాత అదే పాలకేంద్రం నుంచి మరో పాలప్యాకెట్ ను తీసుకుని వచ్చి వేడి చేయగా ఆ పాలు కూడా ప్లాస్టిక్ ముద్దలా మారాయి. దీంతో పాలలో రసాయనాలను కలిపి విక్రయించడం వల్లే పాలు ప్లాస్టిక్ గా మారినట్టు తెలుస్తోంది. ప్లాస్టిక్ పాలు వెలుగు చూడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Updated : 28 May 2020 4:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top