విడి పాలు పోయించుకుంటున్నారా? వీడేం చేస్తున్నాడో చూడండి  - MicTv.in - Telugu News
mictv telugu

విడి పాలు పోయించుకుంటున్నారా? వీడేం చేస్తున్నాడో చూడండి 

May 22, 2020

Milk vendor open packets with teeth in Rajasthan

కాదేదీ కల్తీకి అనర్హం. జనం కూడా సరిపెట్టుకుంటున్నారు. ఆ చేసే కల్తీ పనో, కంత్రీపనో సరిగ్గా కూడా చేసి చావడం లేదు. ప్యాకెట్ పాలకు బదులు కొందరు విడిపాలు పోయించుకుంటుంటారు కదా. వెన్న తీయని పాలు అని, లేకపోతే నమ్మకంగా పోస్తున్న మనిషి  అని ఆ పాలకు అలవాటు పడిపోతుంటారు. అలాంటి వాళ్లు ఈ వీడియో చూస్తే గతుక్కుమంటారు.

 విడిపాలు పోసే ఓ వ్యాపారి కరోనా చలవ వల్ల డిమాండ్ పెరగడంతో ఈ నిర్వాకం వెలగబెట్టాడు. రోడ్డుపక్కన పాలబూత్‌లో ప్యాకెట్లు కొని తన డబ్బాలో పోసుకున్నాడు. దీని కోసం నోటినే కత్తెరగా వాడాడు. ఒక్కో ప్యాకెట్ తీసుకోవడం, నోటితో కొరికి డబ్బాలో పోసుకోవడం! రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. ఎదురుగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. విషయం తెలుసుకున్న అధికారులు అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.