అదిరిందన్నా పాలన్నా..గొట్టంతో భౌతిక దూరం… - Telugu News - Mic tv
mictv telugu

అదిరిందన్నా పాలన్నా..గొట్టంతో భౌతిక దూరం…

May 8, 2020

Milkman’s technique of supplying milk goes viral

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, డాక్టర్లు సూచిస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో భౌతిక దూరం పాటించడానికి కొందరు వ్యాపారస్తులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొందరు వ్యాపారాస్తులు.. వినియోగదారులు భౌతిక దూరం పాటించే విధంగా దుకాణాల ముందు గుండాలు గీస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఓ పాల వ్యాపారి.. వినియోగదారుల నుంచి భౌతిక దూరం పాటించడానికి చేసుకున్న ఏర్పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పాల బండికి పైపును అమర్చి ఫనెల్‌ సహాయంతో వినియోగదారులకు పాలు పోస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను అహ్మదాబాద్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ నితిన్‌ సంగ్వాన్‌ ట్వీట్‌ చేశారు. కొంత మంది తమకు తామే రక్షణ కల్పించుకుంటూ.. ఇతరులకు కూడా రక్షణగా నిలుస్తున్నారని నితిన్ ట్వీట్ లో పేర్కొన్నారు.