కోదండరాం అరెస్ట్.. ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

 కోదండరాం అరెస్ట్.. ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత

March 10, 2018

తెలంగాణ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. ట్యాంక్‌బండ్‌పై వెళ్లేందుకు యత్నించిన టీజేఏసీ నేత ప్రొఫెసర్‌ కోదండరాంను మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. ఆయన తార్నాకలోని తన నివాసం నుంచి మిలియన్‌ మార్చ్‌ సభకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. సభకు తాము అనుమతివ్వలేదు కనుక వెళ్లొద్దని హెచ్చరిస్తూ ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. దీంతో కోదండరాం చాలాసేపు తన కారులోనే ఉండిపోయారు. ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోవడంతో అరెస్ట్‌ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ట్యాం ఎట్టిపరిస్థితుల్లోనూ సాయంత్రం సభ నిర్వహించి తీరతామని జేఏసీ ప్రకటించింది. దీంతో ట్యాంక్‌డ్ వద్ద తీవ్ర ఉద్రక్తత నెలకొంది. ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లేందుకు యత్నించిన పలు పార్టీ, ప్రజాసంఘాల నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీపీఐ నేతచాడా వెంకటరెడ్డిని పార్టీ ఆఫీసులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కన్నుగప్పి కొందరు ట్యాంక్ బండ్‌పైకి చేరుకున్నారు.