Millions of money in Sri Lanka's presidential palace
mictv telugu

అధ్యక్ష భవనంలో మిలియన్ల డబ్బు.. లెక్కిస్తున్న వీడియో

July 10, 2022

నిరసనకారులు ముట్టడించడంతో శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స తన నివాసాన్ని విడిచిపెట్టి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భవనంలోని వ్యాయామశాల, స్విమ్మింగ్ ఫూల్‌లలో ఆందోళనకారులు సందడి చేశారు. అలాగే భవనం మొత్తం కలియదిరిగి 17.8 మిలియన్ల నగదును కనుగొన్నారు. ఈ మొత్తం డబ్బును స్వాధీనం చేసుకున్న ఆందోళనకారులు వాటిని లెక్కించిన తర్వాత సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఈ విషయం పోలీసులకు చేరగా, దర్యాప్తు జరిగిన తర్వాతే వాస్తవాలను తెలుసుకోగలమని వారు వెల్లడించారు. కాగా, ఆర్ధిక, ఆహార సంక్షోభం కారణంగా విదేశీ అప్పులు చెల్లించడంలో శ్రీలంక విఫలమయింది. దీంతో ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేయగా, ప్రధాని సహా అందరూ రాజీనామా చేశారు. అనంతరం ప్రజా ఆందోళన తట్టుకోలేక అధ్యక్షుడు రాజపక్స పారిపోయి ఓడలో వెళ్లిపోయినట్టు విశ్వసనీయ సమాచారం.