పుతిన్ ని చంపితే పది లక్షల డాలర్లు ఇస్తా : సైన్యానికి రష్యా వ్యాపారి ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్ ని చంపితే పది లక్షల డాలర్లు ఇస్తా : సైన్యానికి రష్యా వ్యాపారి ఆఫర్

March 3, 2022

 10

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను చంపినా లేదా యుద్ధ నేరస్థుడిగా అరెస్ట్ చేసినా మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని రష్యన్ బిజినెస్ మెన్ కొనానిఖిన్ ఫేస్బుక్ వేదికగా బహిరంగంగా ప్రకటించాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ మౌనంగా ఉండలేననీ, రష్యన్ పౌరుడుగా నాజీయిజం నుంచి నా దేశాన్ని కాపాడుకునే బాధ్యత తన మీద ఉందని స్పష్టం చేశారు. ‘రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పుతిన్ తనను తాను జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అకారణంగా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకు కారణమవుతున్నా’డని విమర్శించారు. కాగా, కొనానిఖిన్ రాజీకీయ ఒత్తిళ్ల కారణంగా 1992లో రష్యాను వీడి అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్నాడు.