ఇప్పటికైనా అర్థమైందా?..బీజేపీకి ఒవైసీ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇప్పటికైనా అర్థమైందా?..బీజేపీకి ఒవైసీ కౌంటర్

October 25, 2019

గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మజ్లీస్ అధినేత అస్ససుద్దీన్ ఒవైసి బీజేపీ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి ఉపఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందన్నారు. 

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రాబల్యం కూడా తగ్గిందన్నారు. ఎప్పుడూ మోదీ హవాపైనే గెలవాలనుకుంటే కుదరదన్నారు. హరియాణాలో మోదీ 15 ర్యాలీలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి చతికిల పడ్డారని విమర్శించారు. ఇప్పటికైనా మోదీ హవాను నమ్ముకోవడం మాని ఆర్థిక రంగంపైనా, గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి పెట్టాలని బీజేపీకి హితవు పలికారు. ఈ సందర్భంగా విజయం సాధించిన టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి అభినందనలు తెలిపారు.