మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ వివాదాల కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 7లో నివస్తున్న డాక్టర్ మజారుద్దీన్ సోమవారం తనింట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని కిందపడిపోయాడు. తుపాకీ శబ్దం వినిపించడంతో పక్క గదిలో కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న అసదుద్దీన్ తమ్ముడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆస్పత్రికి చేరుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.