ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. మీకు కేవలం 7గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ..ధీటైన సమాధానం ఇచ్చారు ఓవైసీ. తాము వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామన్న అక్బరుద్దీన్…అసెంబ్లీలో 15మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉండేలా చూసుకుంటాం. వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి మా సత్తా చూపిస్తామన్నారు. మరికొన్ని నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు గంట సమయం కేటాయిస్తే…మాకెంత సమయం కేటాయిస్తారని మంత్రి కేటీఆర్ వేసిన ప్రశ్నకు అక్బురుద్ధీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.