ఎంపీ అసదుద్దీన్‌కు కరోనా అంటూ ప్రచారం.. నిజం ఏంటంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీ అసదుద్దీన్‌కు కరోనా అంటూ ప్రచారం.. నిజం ఏంటంటే

June 30, 2020

mhm nb m

కరోనా సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, ప్రజా ప్రతినిధులను ఎవర్నీ వదలడం లేదు. తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ప్రజా ప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు పాజిటివ్ అని తేలింది. హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా అని తేలడంతో సోమవారం మరో ప్రచారం కూాడా సాగింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కరోనా బారినపడ్డారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 

అసదుద్దీన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిందని జోరుగా ప్రచారం సాగింది. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు.తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ సృష్టిగా  పేర్కొంటూ ప్రత్యర్థులు చేసిన పనిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఇంకా టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే వైరస్ పై పోరాటం చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు కరోనా సోకలేదని స్పష్టమైంది.