ముస్లింల కంటే ఎలుకలే డేంజర్.. ఒవైసీ  - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింల కంటే ఎలుకలే డేంజర్.. ఒవైసీ 

September 25, 2019

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకూ విస్తరించడానికి ముమ్మర పర్యటనలు చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నార. భావసారూప్య పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తున్నారు. తాజాగా ఆయన జార్ఖండ్‌లో పర్యటించారు. రాంచీలో జరిగిన సభలో బీజేపీని, దాని మిత్రపక్షాలను తూర్పారబట్టారు. 

Owaisi.

‘ఈ దేశానికి మైనారిటీల నుంచి కంటే ఎలుకల నుంచే అధిక ప్రమాదం ఉంది..’ అని ఒవైసీ అన్నారు. జార్ఖండ్‌లో ఇటీవల నిర్మించిన కోనార్ రిజర్వాయర్ కాలువ గట్టు నిర్మించిన 12 గంటల్లోపే తెగడానికి ఎలుకలే ప్రధాన కారణమని అక్కడి అధికారులు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ‘ఆ విషయాన్ని అప్పుడే విస్మరించారా? దేశానికి ముస్లింలకంటే కంటే ఎలుకల వల్లే ఈ ప్రమాదం ఉంది. కోనార్ రిజర్వాయర్ ఈ సంగతి రుజువు చేసింది..’ అని అన్నారు. తమ పార్టీ జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. తూర్పు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన ఎన్ఆర్సీ గురించి ప్రస్తావింస్తూ.. ‘ముస్లింలను బీజీపీ, ఆరెస్సెస్ లు బంగ్లాదేశీలయులని ముద్ర వేస్తున్నాయి. అయితే అవి ఆ దేశానికి కరెంటును అమ్మడం మాత్రం మానుకోవడం లేదు’ అని అన్నా. గోడా జిల్లాలోని రిలయన్స్ విద్యుత్ కేంద్రంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.