MIM President Asaduddin Owaisi Made Sensational Comments on 7th Nizam
mictv telugu

నిజాం నవాబు పెద్ద తప్పు చేశాడు.. అసదుద్దీన్ ఒవైసీ

September 17, 2022

MIM President Asaduddin Owaisi Made Sensational Comments on 7th Nizam

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది ఎంఐఎం పార్టీ. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. తొలిసారిగా 7వ నిజాంను విమర్శిస్తూ తప్పుపట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చివరి ఏడో నిజం చాలా పెద్ద తప్పు చేశాడని అన్నారు. 1948 జూన్ 15న ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాన్ అలీ ఖాన్ ఆమోదించి ఉండాల్సిందని ఆయన అన్నారు. ఆ డ్రాఫ్ట్ ను నిజాం ఆమోదించి ఉంటే తెలంగాణలో పోలీస్ యాక్షన్ జరిగి ఉండేది కాదని చెప్పారు.

కశ్మీరీలకు ఇచ్చిన ఆర్టికల్ 370 కన్నా ఎక్కువ లాభాలను పొందే అవకాశాన్ని నిజాం చేజార్చారని అన్నారు. నిజాం ఆనాడు ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారని చెప్పారు. మరోవైపు, లార్డ్ మౌంట్ బాటన్, ఖాసీం రిజ్వీ ఇద్దరూ నిజాంను మోసం చేశారని చెప్పారు. ఆనాడు అందరూ కలిసి నిజాంను మోసం చేశారని ఆరోపించారు అసదుద్దీన్ ఒవైసీ.