ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత 

May 23, 2020

Mimicry artist harikishan passed away

తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలో ప్రజలను అలరించిన ప్రముఖ మికిక్రీ కళాకారుడు, సినీనటుడు హరికిషన్(57) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. వందమందికిపై గొంతుకలను అనుకరించే ఆయన ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. 

హరికిషన్ స్వస్థలం ఏపీలోని ఏలూరు. బాల్యంలోనే మిమిక్రీపై ఆసక్త పెంచుకున్న ఆయన మిమిక్రీ దిగ్గజం నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో ధ్వన్యనుకరణపై పట్టుసాధించారు. ఎన్టీఆర్‌, అక్కినేని, చిరంజీవిల గొంతుకలను బాగా అనుకరించేవారు.  వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌, వీహెచ్‌ వంటి రాజకీయ నాయకుల గొంతులు కూడా ఆయనకు కొట్టినపిండే. కొన్నాళ్లు స్కూల్లో టీచర్ గా పనిచేసి హరికిషన్ ఆ జీవితం నచ్చక పూర్తి స్థాయి మిమిక్రీ కళాకారుడిగా మారారు. సినిమాల్లో చిన్నచిన్న వేషాలు కూడా వేశారు. టీవీ చానళ్లలో లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశారు.