Mind blowing video appears to show horses floating on water along Arizona river
mictv telugu

నీటిపై మహిమల గుర్రాలు.. వైరల్ వీడియో

August 10, 2022

విఠలాచార్య సినిమాల్లో మనుషులు, జంతువులు గాల్లో తేలిపోతుంటారు. కామగమనం అనే విద్య తెలిసినవారు నీటిపై నింగిపై చక్కగా ప్రయాణం చేస్తారని, అనుకున్న చోటికి సులువుగా వెళ్తారని అంటారు. అదెంత నిజమోగాని, ఈ వీడియోను చూస్తే మటుకు దిమ్మ తిరిగిపోతుంది.
అది అమెరికాలోని అరిజోనా నది. కెల్లీ రోజర్స్ అనే బామ్మ తన మనవళ్లతో కలసి పడవలో షికారుకు వెళ్లింది. వాళ్లది పెడల్ బోటు. పెడల్స్ తొక్కుతూ వీడియో తీసుకున్నారు. తీసిన వీడియోను చూశాక కెల్లీకి మైండ్ బ్లాక్ అయ్యింది. నదిలో రెండు గుర్రాలు నీటిపై నిల్చునే రయ్యన దూసుకెళ్లాయి. తర్వాత నింపాదిగా నేలపైకి అడుగు పెట్టాయి. ‘ఇదేందమ్మో ఇది.. ఎక్కడ చూడలా..’ అని ఆమె అవాక్కైంది. తర్వాత విషయం తెలుసుకుని నవ్వేసింది. ఆ గుర్రాలు కెల్లీకి కాస్త దూరంలో తక్కువ నీటిలో నిల్చుని ఉన్నాయి. వాటి వెనక ప్రకృతి చాలా దూరంగా ఉన్నా దగ్గరిగా ఉన్నట్లు కనిపిస్తోంది. కెల్లీ పడవ గుర్రాల ముందు నుంచి వేగంగా వెళ్లడంతో, గుర్రాలు ప్రకృతికి వెనక్కి వెళ్తూ ఆప్టికల్ ఇల్యూజన్ వల్ల గుర్రాలు నీటిలో నిలబడే ఏదో రాఫ్ట్‌పై దూసుకెళ్తున్నట్లు కనిపించింది.