తల్లి నుంచే బిడ్డకు తెలివి.. శాస్త్రవేత్తలు తేల్చేశారు..     - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి నుంచే బిడ్డకు తెలివి.. శాస్త్రవేత్తలు తేల్చేశారు..    

February 14, 2020

Mother

పుట్టబోయే బిడ్డ అందం, తెలివిపై తల్లిదండ్రులు రకరకాల ఆశలు పెట్టుకుంటారు. తల్లి పోలిక అని కొంత మంది తండ్రి పోలిక రావాలంటూ తెగ మురిసిపోతారు. వీటిలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనల్లో మాత్రం ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లల తెలివితేటలకు సంబంధించి తల్లి నుంచి సంక్రమించే క్రోమోజోముల వల్లే ప్రభావితం అవుతాయని తేల్చారు. 

సాధారణంగా మహిళల్లో ఎక్స్,వై క్రోమోజోములు ఉంటాయి. పురుషుల్లో మాత్రం ఎక్స్ క్రోమోజోము మాత్రమే ఉంటుంది. వీటిలో తండ్రి జన్యువులతో పోల్చితే తల్లి జన్యువులే మేదస్సులో ఎక్కువగా పాత్ర పోషిస్తాయని తేల్చారు. పరిశోధనల్లో భాగంగా ఎలుకలకు తల్లి జన్యువులను అధిక మోతాదులో ప్రవేశపెట్టగా వాటి మెదడు, తల సాధారణం కంటే ఎక్కువగా పెరిగింది. తండ్రి జన్యువులను ప్రవేశపెడితే తల సాధారణంగా ఉండి శరీరం ఎక్కువగా పెరిగింది. దీన్ని బట్టి మెదడు పరిమాణంలో తల్లి జన్యువులే కీలకమని నిర్ధారణ జరిగింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే జన్యువుల ప్రభావం 40-60 శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. మిగితాది చుట్టూ ఉన్న పరిస్థితులే ప్రభావితం చేస్తాయంటున్నారు.