Home > క్రైమ్ > ఈ ఎదవ ప్లాన్ గురించి చదవండి !

ఈ ఎదవ ప్లాన్ గురించి చదవండి !

రెండు రోజల వరకు టెన్షన్ క్రియేట్ చేసిన కిడ్నాప్ వ్యవహారాన్ని వైజాగ్ పోలీసులు చేధించ గలిగారు. ఐటిఐ చదువుతున్న 20 ఏళ్ళ మణికాంత అనే యువకుడు తనను తాను కిడ్నాప్ చేస్కొని అడ్డంగా వాళ్ళకు దొరికిపోయాడు ? గోపాలపురంలోని లక్ష్మీ నగర్ లో వుంటూ పెందూరిలో చదువుకునే మణికాంతకు తన విలాసాలకు డబ్బు అవసరం పడింది. అప్పుడు నేరుగా తల్లిదండ్రులను అడిగితే ఇవ్వరనుకొని, తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక స్కెచ్చేసాడు. పక్కా ప్లాన్డ్ గా అడుగులు కదిపాడు. తనను తాను కిడ్నాప్ చేస్కున్నాడు. రెండు రోజుల నుండి కన్న కొడుకు కనబడట్లేదని అతని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇంతలో తండ్రి ఫోన్ కు కాల్ వచ్చింది. మీ కొడుకు కిడ్నాప్ అయ్యాడు. ఇతణ్ని చంపితే 10 లక్షల సుపారీ వుంది. మీరు 15 లక్షలిస్తే మీ కొడుకు సేఫ్ గా ఇంటికొస్తాడని గొంతు మార్చి కాల్ చేసి చెప్పాడు.

డబ్బులు ఎక్కడివ్వాలో ప్లేస్ కూడా చెప్పాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడేమో గానీ పోలీసులు మాత్రం పట్టుకోగలరు. తండ్రికి ఎందుకో అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. అంతే ఇంక పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్ కాల్ డేటా ఆధారంగా ట్రేస్ చేసి, సిసిటీవి ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. అలా కిడ్నాపర్ అవతారమెత్తిన కొడుకు బండారాన్ని బయట పెట్టారు. పాపం మణికాంత ఇలా జరుగుతుందని ఊహించలేదేమో ? ప్లాన్ గీసి పట్టుబడ్డాడు. తల్లిదండ్రుల ముందు ముఖం చెల్లకుండా చేస్కున్నాడు.

మణికాంతలా చాలా మంది యువకులు విలాసాలకు అలవాటు పడి చెడు దారులను ఎంచుకుంటున్నారు. ఈజీవేలో ఈజీమనీ సంపాదించుకొని హాయిగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నారు. కానీ ఇలాంటి రాంగ్ స్టెప్పులెప్పుడూ నెగెటివ్ రిజల్ట్స్ నే ఇస్తాయని ఎప్పుడు తెలుసుకుంటారో ? ఏదేమైనా కష్టపడి చదువుకొని మంచి స్థాయికి ఎదగాలి. కానీ లైఫును ఎంజాయ్ చేద్దామనే అత్యాశతో పక్కదారులు పడితే ప్రాబ్లెంలో ఇరుక్కునేది వాళ్ళే.

Updated : 27 July 2017 4:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top