జగన్.. విజయసాయిని దింపడంపై ఆళ్ళ వివరణ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్.. విజయసాయిని దింపడంపై ఆళ్ళ వివరణ

May 7, 2020

Minister alla nani explanation about jagan and vijay sai

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించడానికి సీఎం జగన్ విశాఖకు వెళ్లిన సంగతి తెల్సిందే. తొలుత జగన్ తాడేపల్లిలోని అధికారిక నివాసం నుంచి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో విశాఖకు వెళ్లారు. అయితే విమానాశ్రయానికి వెళ్ళేటప్పుడు జగన్ కారు ఎక్కి ముందు సీటులో కూర్చున్నారు. వెంటనే వెనక సీటులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూర్చున్నారు. అయితే క్షణాల వ్యవధిలోనే విజయసాయి కారు నుంచి దిగిపోయారు. ఆ తరువాత మంత్రి ఆళ్ల నాని కారులోకి ఎక్కారు. దీంతో విజయసాయి కారు నుంచి ఎందుకు దిగిపోయారనే అంశం చర్చనీయాంశం అవుతోంది.

దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ”విశాఖ గ్యాస్ లీక్ బాధితుల పరామర్శించడానికి సీఎం జగన్ హెలికాఫ్టర్ లో బయల్దేరారు. ఎంపీ విజయసాయి రెడ్డి హెలికాఫ్టర్ లో తన స్థానాన్ని నాకు ఇచ్చారు. నా మీద గౌరవంతో విజయసాయి తన సీటును నాకు ఇస్తే.. కొందరు విష ప్రచారం చేస్తున్నారు. విశాఖ ప్రమాదం కన్నా నీచ రాజకీయాలే ముఖ్యం అయ్యాయి.” అని మంత్రి విష ప్రచారం చేస్తున్నవారిపై మండిపడ్డారు.