Minister Ambati Rambabu Counter To Nagababu
mictv telugu

అవును.. నేను ‘సంబరాల రాంబాబు’నే.. కానీ ముఖానికి రంగేయను

January 16, 2023

Minister Ambati Rambabu Counter To Nagababu

కాదేదీ కౌంటర్లకు వేదిక అన్నట్లుగా ఏపీ రాజకీయాలు.. సంక్రాంతి పండుగ వేళ కూడా కాకరేపుతున్నాయి. పండుగ వేళ వైసీపీ వర్సెస్‌ జనసేన పార్టీగా మారిపోయింది. భోగీ పండుగ సందర్భంగా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేసిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు వస్తున్నాయి. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. అంబటి మహిళలు, గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను రీట్వీట్‌ చేస్తూ సెటైర్లు వేశారు జనసేన నేత, సినీ నటుడు నాగబాబు. అంబటి రాంబాబును ఉద్దేశిస్తూ ”సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు.. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !” అని కామెంట్లూ పెడుతూ ఎద్దేవా చేశారు..

 

అయితే, నాగబాబు ట్వీట్‌పై అదే స్థాయిలో రియాక్ట్‌ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. అవును నేను సంబరాల రాంబాబునే అంటూనే కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. “నువ్వు, మీ తమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే ! కానీ.. ముఖానికి రంగు వేయను.. ప్యాకేజీ కోసం డాన్స్ చేయను !” అంటూ ఘాటుగా బదులిచ్చారు. దీంతో.. మరోసారి సోషల్‌ మీడియా వేదికగా.. జనసేన వర్సెస్‌ వైసీపీగా పరిస్థితి మారిపోయింది. కొందరు అభిమానులు, జనసేన శ్రేణులు.. పవన్‌ కల్యాణ్, నాగబాబుకు అనుకూలంగా కామెంట్లు పెడుతుంటే… మరికొందరు.. అంబటికి మద్దతుగా నిలిస్తూ మెగా బ్రదర్స్‌ను టార్గెట్‌ చేస్తున్నారు.