కేంద్ర మంత్రికి వింత అనుభవం..గోలీ మంత్రి అంటూ నినాదాలు - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర మంత్రికి వింత అనుభవం..గోలీ మంత్రి అంటూ నినాదాలు

February 3, 2020

bjp.....02

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్‌కు వింత అనుభవం ఎదురైంది. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సమయంలో గందరగోళం నెలకొంది. ఆయను ఉద్దేశించి ప్రతిపక్ష సభ్యులు ‘గోలీ మంత్రి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఆయన సమాధానం చెప్పడం ఆపేయాలని అడ్డుతగిలారు. దీంతో కొంతసేపు సభలో గందరగోళం నెలకొంది. ఆయన లేచిన ప్రతీసారి ఈ నినాదాలు చేయడంతో సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. 

కాగా ఇటీవల అనురాగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఈ విధంగా విపక్షాలు స్పందించాయి.  పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్న వారు దేశద్రోహులనీ.. వారిని కాల్చిపారేయాలంటూ ఠాకూర్ పేర్కొన్నారు. ‘దేశ్ కే గ‌ద్దారోంకో’ అనగానే..అక్క‌డ ఉన్న జ‌నం అంతా ‘గోలీ మారో’ అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఉద్యమకారులపై మూడుసార్లు కాల్పులు జరిగాయి. ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో ప్రచారాన్ని మూడు రోజులపాటు ఎన్నికల అధికారులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.