కిడ్నీ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం తన బంగారు గాజులని విరాళమిచ్చారు కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు. త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ ప్రాంతంలో కిడ్నీ మార్పిడి వైద్య సహాయ కమిటీ సమావేశానికి…మంత్రి హాజరయ్యారు. కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సిన వివేక్ ప్రభాకర్ అనే 27 ఏళ్ల యువకుడి దీనస్థితిని చూసి చలించిపోయారు.
ట్రీట్మెంట్ కి అతని వద్ద అంత మొత్తం లేని విషయం తెలుసుకున్న వేదికపైనే మంత్రి కంట కన్నీరు కార్చారు. వివేక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంత్రి.. వివేక్ సోదరుడు విష్ణు ప్రభాకరన్ వద్దకు వెళ్లారు. వెంటనే తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి.. చికిత్స నిమిత్తం అతనికి విరాళంగా అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఇతరులు కూడా తమ వంతుగా వివేక్ కు సాయమందించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా,వివేక్ తల్లిదండ్రులు ప్రభాకరన్, సరస్వతి కూడా అనారోగ్యంతో ఉన్నారు. వృత్తి రీత్యా ప్లంబర్ అయినప్పటికీ ఇతర ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.