Minister Botsa counter on Minister Puvvada Ajay comment on the Polavaram project
mictv telugu

మేమేం చేయాలో మాకు తెలుసు.. మీ సంగతి మీరు చూసుకోండి.. మంత్రి బొత్స

July 19, 2022

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పువ్వాడ అజయ్‌ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు.. డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోందని , సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేదు అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ‘ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?’ అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

‘‘తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా?గతంలా ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని అడిగితే బావుంటుందా? పువ్వాడ అజయ్‌కి అతడి సంగతి చూసుకోమండి. ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరిపోతుంది. ముంపు మండలాలు, ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబసభ్యులు. ఆ ప్రజల బాధ్యత పూర్తిగా మాది“అంటూ వ్యాఖ్యలు చేశారు. మాట్లాడే నాయకులు బాధ్యతగా మాట్లాడాలి. సమస్యను పరిష్కరించుకునేలా ఉండాలి తప్ప.. రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదన్నారు.