Minister Botsa Satyanarayana key comments on the three capitals
mictv telugu

2-3 నెలల్లోనే విశాఖలో రాజధాని

January 1, 2023

Minister Botsa Satyanarayana key comments on the three capitals

ఏపీ రాజకీయాల్లో రాజధాని అంశం ప్రకపంనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు వైసీపీ మొగ్గుచూపుతుంటే..దీనిని టీడీపీ, అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 3 రాజధానుల వద్దు అంటూ అమరావతి రైతులు సైతం మహా పాదయాత్ర చేపట్టారు. గత రెండేళ్లకుపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని..అందులో భాగంగా విశాఖలో పరిపాలన రాజధాని పెడతామని బల్లగుద్ది చెబుతున్నారు.

విశాఖ నుంచే పరిపాలన

విజయనగరంలో న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులతో కలిసి మంత్రి బొత్స కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2-3 నెలల్లోనే విశాఖ కేంద్రం పరిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు. “ఉత్తరాంధ్ర ప్రజలు భయపడాల్సిన పనిలేదు. త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖ మారుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధానిగా అమరావతిని టీడీపీ ప్రకటించింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తాం” అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.