రోజంతా మంత్రి బిజీ బిజీ ! - MicTv.in - Telugu News
mictv telugu

రోజంతా మంత్రి బిజీ బిజీ !

August 1, 2017

మంత్రి హరీష్ రావు సాగునీటి, విద్యుత్ పనుల మీద వేగం పెంచారు. రోజంతా బిజీ బజీగా గడిపారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లో భాగంగా సేకరించిన అటవీ భూములకు గాను ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకం కోసం 2709 ఎకరాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావును ఆదేశించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం సేకరించవలసిన భూముల గురించి సెక్రెటేరియట్ లో సోమవారం నాడు మంత్రులు సమీక్షించారు. మొత్తం 2709 ఎకరాల భూమిని సేకరించవలసి ఉందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్ రావు కోరారు.

ఈ ప్రక్రియ కోసం ‘ల్యాండ్ బ్యాంకు’ ఏర్పాటు చేసుకోవాలని అన్నీ జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ తో పాటు రోళ్ల వాగు, పాలెంవాగు మీడియం ప్రాజెక్టులు ఇంకా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, దేవాదుల, కల్వకుర్తి, డిండి, తదితర ప్రాజెక్టులు ఇంకా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులలో పెండింగులో ఉన్న భూసేకరణ కు ఆటవీ అనుమతుల సమస్యలపై మంత్రులు చర్చించారు. ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం భూసేకరణ సమస్యలను, అటవీ శాఖ అనుమతి సమస్యలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని హరీశ్ రావు కోరారు. ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్.జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఈ. ఎన్. సి.మురళీధరరావు,
అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఝా, అదనపు పి.సి.సి.ఎఫ్.శోభ, వివిధ ప్రాజెక్టుల సి.ఈ. లు పాల్గొన్నారు.

అలాగే ఈ.ఎన్. సి. విజయ ప్రకాష్ పదవీ విరమణ సభలో

మంత్రి హరీశ్ రావు ప్రసంగిస్తూ

“తెలంగాణ ఏర్పడిన తర్వాత రాత్రీ పగలు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు పని చేస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం వారు శ్రమ పడుతున్నారు. విజయ ప్రకాష్ సౌమ్యుడు. అందరికీ తలలో నాలుకలా మెదిలారు. ఈ శాఖ పటిష్టం కోసం ఆయన పని చేస్తున్నారు. ఏదో ఒక రూపంలో విజయ ప్రకాష్ సేవలను వినియోగించుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఆసియాలో రికార్డు నెలకొల్పనున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఊపందుకున్నవి. ఇరిగేషన్ శాఖ తెలంగాణలో పెద్ద శాఖ. రాబోయే రోజుల్లో ఈ శాఖ ప్రతిష్ట మరింత పెరగనుంది. ఈ శాఖ కు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఇరిగేషన్ శాఖలో పని చేయడం అదృష్టం గా భావించాలి. ప్రాజెక్టులు పూర్తి అయితే రైతుల దీవెనలు పుష్కలంగా అందుతాయి. ఇలాంటి అదృష్టం మరే శాఖ ఉద్యోగులకూ రాదు” అని ఆనందం వ్యక్తం చేసారు.

 

మరో సందర్భంలో

కాళేశ్వరంపై విద్యుత్, ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.

డెడ్ లైన్ లోగా కాళేశ్వరంకు విద్యుత్ సరఫరా జరగాలని సూచించడంతో

విద్యుత్ సరఫరా
ఏర్పాట్లను పూర్తి చేస్తామని ట్రాన్స్ కో హామీ ఇచ్చింది.

2018 జూన్ నాటికి ఇరిగేషన్ కు 12,500 మెగావాట్ల విద్యుత్తు అవసరమని అంచనా.

తెలంగాణలో విద్యుత్ కొరత లేదన్న ట్రాన్స్ కో సి.ఎం.డి.

ఇరిగేషన్ పథకాలకు పుష్కలంగా కరెంటు, 2018 జూన్ కల్లా కాళేశ్వరం పంపింగ్ స్టేషన్ల పని చేయనున్నందున విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. డెడ్ లైన్ లోపే విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, పంపిణీ లైన్ల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రాన్స్ కో సి.ఎం.డి. ప్రభాకర రావు తెలిపారు. విద్యుత్, ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్ రావు మంగళవారం నాడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల కోసం 2018 జూన్ నాటికి 12,500 మెగావాట్ల విద్యుత్తు అవసరమన్నారు.

ఈ మేరకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన అన్నీ చర్యలు తీసుకుంటామని ట్రాన్స్ కో సి.ఎం.డి. ప్రభాకరరావు హామీ ఇచ్చారు. తమ సంస్థ ఒక కార్యాచరణ ప్రణాళికతో ఆయా పనులు పూర్తి చేస్తామని అన్నారు. కాళేశ్వరం పంపు హౌజ్ ల పనులు 2018 మార్చ్ చివరి కల్లా పూర్తి చేయడానికి టైం లైన్ పెట్టుకున్నందున విద్యుత్ సంస్థలు తమ పనులను మరింత వేగవంతం చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు. ప్యాకేజిల వారీగా పంపింగ్ స్టేషన్ లను పూర్తికి గాను టార్గెట్ పెట్టుకొని ఇరిగేషన్ శాఖ పని చేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులకు మంత్రి వివరించారు. వచ్చే డిసెంబర్ కల్లా ప్యాకేజీ 6 పనులన్నీ పూర్తి చేయనున్నట్టు హరీశ్ రావు చెప్పారు. వివిధ పనులకు సంబంధించిన డెడ్ లైన్లను ఖరారు చేశామని తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం పంప్ హౌజ్ ల పనులు పుంజుకున్నాయని 2018 మార్చి కల్లా పూర్తి కానున్నాయన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ లో సాగునీటిని అందించనున్నట్టు తెలిపారు. వీటి పంపులు, మోటార్ల తయారీ దారులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ డిసెంబర్ కల్లా 6, 8 ప్యాకేజీ ల పంపు హౌజ్ ల నిర్మాణం పూర్తవుతాయన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, పంపు హౌజ్లతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లోనూ రిజర్వాయర్ల మీదుగా వెళ్తున్న 220 కె.వి, 132 కె.వి,33 కె.వి విద్యుత్ లైన్లను తరలించాలని మంత్రి కోరారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు హెచ్. టి లైన్లు అడ్డంకి గా మారకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా రిజర్వాయర్ల పరిధిలోని హెచ్.టి. లైన్లు, టవర్ల తరలింపు ప్రక్రియను వెంటనే చేపడతామని ట్రాన్స్ కో సి.ఎం.డి.ప్రభాకరరావు చెప్పారు.
ఈ మూడు బ్యారేజీల పరిధిలోని పంపు హౌజ్ ల నిర్మాణానికి అవసరమైన విద్యుత్ సరఫరా అంశాలపై మంత్రి ట్రాన్స్ కో, జెన్ కో అధికారులతో చర్చించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన, షెడ్యూల్ కన్నా ముందే పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల సహకారం, తోడ్పాటు అవసరమని మంత్రి అన్నారు.

2018 మార్చి లోగా 10 సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. అయితే త్వరితగతిన విద్యుత్ సబ్ స్టేషన్ టెస్టు పూర్తి చేయాలన్నారు. ఆరు 400 కె.వి.సబ్ స్టేషన్లు, మూడు 220 కె.వి.సబ్ స్టేషన్లు, రెండు 132 కె.వి. సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి కోరారు.
కాళేశ్వరం 6,7,8,9,10,11,12 ప్యాకేజీ లలో పంపింగ్ స్టేషన్ల ప్రోగ్రెస్ ను మంత్రి సమీక్షించారు.విద్యుత్ టవర్ల నిర్మాణం, హెచ్. టి లైన్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కాళేశ్వరం కోసం 59 టవర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. రానున్న రోజుల్లో ఇరిగేషన్, విద్యుత్ సంస్థలు మరింత సమన్వయంతో పని చేయవలసి ఉందని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.

ఇరిగేషన్, ట్రాన్స్ కో కు చెందిన ఉత్సాహవంతులైన ఇంజనీర్లతో ఒక టీమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో ప్రాజెక్టు దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని వాటిలో ఈ టీమ్ పని చేయాలని కోరారు.
ఇరిగేషన్ ఈ.ఎన్. సి.సి. మురళీ దర్ రావు,ట్రాన్స్ కో డైరెక్టర్ సూర్యప్రకాష్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం, ఎత్తి పోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్ కో సి.ఈ. ప్రభాకర్, కాళేశ్వరం సి.ఈ లు ఎన్.వెంకటేశ్వర్లు, హరిరామ్, సి.ఈ. సునీల్, భగవంతరావు, లింగరాజు, బంగారయ్య, శంకర్ తదితర ఇరిగేషన్, ట్రాన్స్ కో, జెన్ కో అధికారులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు. ఇలా రోజంతా మంత్రి హరీష్ రావు పైన తెలిపిన పనుల మీద చాలా బిజీగా గడిపారు.