ఆదినారాయణరెడ్డి నోట రోతపాట - MicTv.in - Telugu News
mictv telugu

ఆదినారాయణరెడ్డి నోట రోతపాట

August 17, 2017

అధికారమదం, ధనబలంతో బుర్రలు పాడైపోయి పబ్లిగ్గా నోటికొచ్చినట్టు మాట్లాడటం.. తర్వాత ‘నేనలా అనలేదు.. మీడియా నా మాటలను వక్రీకరించింది’ అని ముక్తాయించడం మన రాజకీయ నాయకులకు రోతతో పెట్టిన విద్యే.

ఆంధ్రప్రదేశ్ మంత్రి సి. ఆదినారాయణరెడ్డి నోరు కూడా అలాంటి పాడే పాటింది.
‘దళితులు నీటుగా ఉండరు, వాళ్లకు చదువు రాదు.. రిజర్వేషన్లను ఎత్తిపారేయాలి’ అని నానామాటలూ అనేసి ఘోరంగా తిట్లుతిన్న ఆది.. ఇప్పుడు మాట మార్చారు.
‘అబ్బే.. నేనలా అనలేదు.. నేను ఆ మాటలంటున్నట్లు ఉన్న వీడియోను వక్రీకరించి ప్రచారం చేశారు.. దళితులు బాగా చదువుకోవాలని, ఆరోగ్యం బాగుండటానికి శుభ్రంగా ఉండాలి చెప్పానంతే.. ’’ అని అన్నారు. దానితోపాటు వైఎస్ జగన్ ను కూడా ఆడిపోసుకున్నారు. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిని ఎన్నికల్లో ఓడించినందుకు ఆయన తనపై పగబట్టారని, తనకు ప్రాణహాని ఉందని అసందర్భంగా చెప్పుకొచ్చారు.